భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఇంటర్ విద్యార్థులకు ఇక పరీక్ష హడావుడి మెుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫీజుపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ఐపీఈ) మార్చి 2026కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫీజుకు సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు సిద్ధం అవుతున్నవారికి పరీక్ష ఫీజు తేదీలు వర్తిస్తాయి.

ఫైన్ లేకుండా ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేదీ 15-09-2015 నుంచి చివరి తేదీ 10-10-2025 వరకు ఉంది. అదే రూ.1000 ఆలస్య రుసుముతో 11-10-2025 నుంచి 21-10-2025 వరకు చెల్లించవచ్చు. ఈ తేదీల తర్వాత అవకాశం ఇవ్వమని బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపల్స్ సకాలంలో ఫీజ...