భారతదేశం, మే 5 -- ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఇంటర్‌ ఫలితాలతో పాటు పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా హాల్‌ టిక్కెట్లను మంగళవారం విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.

అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల థియరీ పరీక్షలకు హాల్‌ టిక్కెట్లను కాలేజీ లాగిన్‌లలో అందుబాటులో ఉంచుతారు. కాలేజీ ప్రిన్సిపల్స్‌ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లోని లాగిన్‌ ద్వారా ఉదయం 11 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు 2025 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌ టిక్కెట్ నంబర్‌తో పాటు ఆధార్‌ నంబర్‌ ను ఎంటర్ చేయడం ద్వారా వాట్సాప్‌ మన మిత్రలో కూడా నేరుగా హాల్‌ టిక్కెట్లన...