భారతదేశం, డిసెంబర్ 17 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుపై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు ముగిసినప్పటికీ.. తత్కాల్ స్కీమ్‌ను కింద విద్యార్థులకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ప్రకటన జారీ అయింది.

తాజా ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ.5,000 ఫైన్‌తో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ తేదీల తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు ప...