భారతదేశం, ఏప్రిల్ 24 -- ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలో ఆర్జీయూకేటీ యూనివర్శిటీకి నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో క్యాంపస్‌లు ఉన్నాయి.

ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఆర్జీయూకేటీ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

https://rgukt.in/academics/programmes/undergraduate-programmes/

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో ప్రవేశపెట్టిన ఆర్జీయూకేటీ ట్...