భారతదేశం, మే 10 -- ఆంధ్రప్రదేశ్ నుంచి మరో మూడు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. కనెక్టెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ను సాకారం చేసేందుకు.. ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జూన్‌ 2 నుంచి విజయవాడ- బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడుస్తాయని రామ్మోహన్ వివరించారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని నుంచి ఐటీ హబ్‌ బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చని చెప్పారు.

అలాగే జూన్‌ 12 నుంచి విశాఖపట్నం- భువనేశ్వర్‌ సర్వీసు ప్రారంభం కానుందని కేంద్రమంత్రి వెల్లడించారు. రెండు తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఈ సర్వీసు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. విశాఖ - అబుదాబి అంతర్జాతీయ సర్వీసు జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇండిగో సంస్థ...