Andhrapradesh, జూలై 23 -- ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ జూలై 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తం వంద పోస్టుల్లో బ్యాక్ లాగ్ పోస్టులు 30 ఉండగా. కొత్తగా 70 పోస్టులు ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్ష సెప్టెంబరు 7వ తేదీన నిర్వహించనున్నారు.

మరోవైపు ఏపీ అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 691 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర...