భారతదేశం, నవంబర్ 13 -- రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇంకా 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 26వ తేదీ వరకు ఈ క్యాంపుల ద్వారా సేవలను పొందవచ్చు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు వార...