భారతదేశం, డిసెంబర్ 13 -- కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర హోంశాఖ తీపికబురు చెప్పింది. ఎంతోకాలం ఎదురు చూస్తున్న శిక్షణకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమవుతుంది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.

"రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి లాంఛనంగా శిక్షణ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు" అని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు.

ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లను హోంమంత్రి అనిత ఇవాళ పరిశీలించారు. జరిగింది. డీఐజీ ఏసుబాబు , గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ , బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు కలిసి ...