భారతదేశం, నవంబర్ 14 -- దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల‌ బుకింగ్ ఈనెల 14 నుంచి (శుక్రవారం) నుంచి పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. సాంకేతిక కారణాలతో గత సెప్టెంబరు నెలాఖరు నుంచి నిలిచిన స్లాటు బుకింగ్ లు శుక్రవారం నుంచి ప్రారంభించి, డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలిపారు.

ఇప్పటికే నిరీక్షణ జాబితా (వెయిటింగ్ లిస్టు)లో వేచి ఉన్న సుమారు 10 వేల మందికి స్లాటు బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆ తరువాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి స్లాట్లు (తేదీ, సమయం) ఇస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్లాట్ బుకింగ్‌కు రూ.40, జారీ చేసిన స‌ర్టిఫికెట్ ముద్ర‌ణ‌కు రూ.40 చొప్పున ఫీజులు వ‌సూలు చేసేవారు. దివ్యాంగుల ఆర్థిక ప‌రిస్థితిని దృష్టి...