భారతదేశం, మే 13 -- వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు.

ఇప్పటి వరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 91 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ఆ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికత కేంద్రంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

ఇప్ప...