భారతదేశం, మే 14 -- ఏపీలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ కసరత్తు కొలిక్కి వచ్చింది. గత ప్రభుత్వంలో పాఠశాలల హేతబద్దీకరణ పేరుతో జీవో 117కు ప్రత్యామ్నయంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన జీవోలు విడుదలయ్యాయి. తాజా నిర్ణయంతో మెగా డిఎస్సీలో భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విభజన పూర్తయింది. మొత్తం 9 రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ప్రభు త్వం మంగళవారం 19, 20, 21 జీవోలను జారీ చేసింది. ఏపీలో పాఠశాల వర్గీకరణ, బోధనా సిబ్బంది వ్యవస్థీకరణ, పోస్టుల పంపిణీ, విధి విధానాలను ఖరారు చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాలల విభజన 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ...