భారతదేశం, డిసెంబర్ 17 -- 1975 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత, జోనల్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్‌‌కు సంబంధించినది. ఇందులో కేంద్రం మార్పులు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా విభజించింది.

ఈ ఆరు జోన్లను రెండు మల్టీ జోన్లుగా విభజన చేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 3 జోన్లు ఒక మల్టీ జోన్‌లో, మరో 3 జోన్లు మరో మల్టీ జోన్‌లో ఉంటాయి ఈ సవరణతో ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక కేడర్, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ మీద స్పష్టత వచ్చినట్టైంది. ఇక మీద ఒకే చోట ఏడు సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు.

జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం...