Andhrapradesh, అక్టోబర్ 11 -- రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో 'అయుష్' వైద్య సేవల విస్తరణ, మెరుగు కోసం రూ.166 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ముఖ్యంగా రూ.210 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రెండు ఆయుర్వేద, ఒక యూనాని వైద్య కళాశాల రానున్నాయి. ఆరు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఒక్కో ఆనువత్రి ఏర్పాటుకు రూ.7 కోట్ల వరకు వ్యయం కానుంది. అంతేకాకుండా ఆయుర్వేద ఆరోగ్య మందిరాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు కేటాయించింది.

2014-24 మధ్య రాష్ట్రానికి రూ.120.17 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో గత ప్రభుత్వ పాలనలో కేంద్రం నుంచి రూ.38.09 కోట్లు విడుదలయ్యాయి...