భారతదేశం, ఏప్రిల్ 15 -- ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఎడ్యుకేష‌న్ క‌న్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (ఈడీసీఐఎల్) సంస్థ నుంచి కెరీర్ అండ్ మెంట‌ల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు ఆఖ‌రు తేదీగా ఏప్రిల్ 20న నిర్ణయించారు. ఏపీలోని 26 జిల్లాల్లో 103 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం 103 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ పోస్టులను 26 జిల్లాల్లో 103 భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపిక అభ్యర్థుల‌కు 2026 మార్చి వ‌ర‌కు టెర్మ్ ఉంటుంది. ఆ త‌రువాత వ‌చ్చే అకాడ‌మిక్ ఇయ‌ర్ నుంచి మ‌రో ప‌ది నెల‌లు పాటు పెంచుతారు.

కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ పోస్టుల‌కు విద్యా అర్హత ఎ...