భారతదేశం, మే 2 -- ఏపీ డిఎస్సీ 2025లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. మే2వ తేదీ నుంచి 31 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

ఏపీ మెగా డిఎస్సీలో మొత్తం 421 ఉద్యోగాలను స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేస్తారు. డీఎస్సీ-2025 లో భాగంగా 3శాతం క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. స్పోర్ట్స్‌ కోటా డిఎస్సీ నోటిఫికేషన్‌ లింకు కోసం క్లిక్‌ చేయండి.

https://sportsdsc.apcfss.in/

మెగా డిఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రకటించింది. డిఎస్సీ నియామకాల్లో భాగంగా అర్హత కలిగిన క్...