భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్ మరోసారి ఎన్నికలతో హీటెక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మెుదలుపెట్టింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం దగ్గరపడుతుండటంతో ఆ వైపుగా ఎన్నికల దిక్కు అడుగులు పడుతున్నాయి. ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియడానికి మూడు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అనుకుంటోంది. ఇందుకోసం చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నాడు పంచాయతీ రాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల సన్నాహక షెడ్యూల్‌ను పంపారు. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పోరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో అయిపోతుంది.

2021లో ఎన్నికలు జరిగిన ...