భారతదేశం, ఏప్రిల్ 25 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ -అదాని లతో చేసుకున్న 25 సంవత్సరాల సౌర విద్యుత్‌ ఒప్పందంతో ఏపీ ప్రజలకు లక్షా పాతిక వేల కోట్ల నష్టం కలుగుతుందని ఈ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రకటించడంపై పౌర సమాజ ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సెంటర్‌ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ బ్యూరోక్రాట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెకి- అదానీ ఒప్పందంతో ప్రజలకు అపార నష్టం జరుగుతుందని, చంద్రబాబు గతంలో సెకి అదానీ ఒప్పందంపై గతంలో శ్వేత పత్రం విడుదల చేశారని, ఈ ఒప్పందంతో ప్రజలపై లక్షా 20వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారని గుర్తు చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....