భారతదేశం, మే 12 -- ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై గత కొన్ని రోజులు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంపుపై కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు.

విద్యుత్‌ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకే సమయం సరిపోతుందని అన్నారు.

గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఒక ఆదాయ వనరుగా వాడుకుందని మంత్రి గొట్ట...