Andhrapradesh, జూలై 25 -- రాష్ట్రంలోని 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మరో రూ.500 కోట్లతో రాష్ట్రంలో దెబ్బతిన్న మిగిలిన రహదారుల మరమ్మతులు వర్షాకాలంలోనూ కొనసాగించాలని... వీలున్నంత త్వరగా వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రహదారుల నిర్మాణం, మరమ్మతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో అధ్వాన్నంగా తయారయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి..? ఏవి కొత్తగ...