Andhrapradesh, జూన్ 1 -- ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. వాహనాల ద్వారా పంపిణీని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ డోర్‌ డెలివరీ పేరుతో రేషన్‌ దుకాణాల పరిధిలోని కూడళ్లలో రేషన్‌ పంపిణీ జరిగేది. ప్రతి రేషన్ దుకాణం పరిధిలో నిర్దేశిత పాయింట్‌లో రేషన్‌ వాహనాల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేవారు. గతంలో రేషన్ దుకాణాల్లో కార్డుదారులే వెళ్లి సరుకులు తెచ్చుకునే వారు.

వాహనాలతో రేషన్‌ పంపిణీతో బియ్యం పక్క దారి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధానంతో లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ...