భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30, 2025తో ముగియనుంది. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముందు రేషన్ కార్డు eKYC ప్రక్రియ చేపట్టింది. ఈ e-KYC ద్వారా రేషన్ కార్డులోని సభ్యులు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కార్డులో సభ్యుల రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంది.

ముందుగా మీ రేషన్ దుకాణం డీలర్ వద్ద ఉన్న లిస్ట్ ...