భారతదేశం, మే 16 -- ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెను వెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి.

ఏపీలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా కొన్ని సంస్థలు శంకుస్థాపనలు చేయగా మరి కొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా, 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

ఈ పెట్టుబడుల ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాన్నాయి. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రూ. 33 వేల కోట్లక...