భారతదేశం, జనవరి 2 -- ఈ కొత్త సంవత్సరం వేళ ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా కిలో గోధుమ పిండిని అందజేయనుంది.

బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉండగా, ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. తాజాగా గోధుమ పిండి కూడా రేషన్ కార్డుదారులకు అందనుంది.

ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించ...