భారతదేశం, నవంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనను క్రమబద్ధీకరించడానికి ఏకీకృత చట్టాన్ని రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో పాఠ్యాంశాలను ఉద్యోగ ఆధారితంగా మార్చడానికి వాటిని పునరుద్ధరించాలని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగు సంవత్సరాలు కళాశాలల్లో చదివినప్పటికీ.. ఉత్తీర్ణులైన చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోతున్నారని గుర్తించారు. హైదరాబాద్ అమీర్‌పేటలో కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుని జాబ్స్ పొందుతున్నారన్నారు.

ఈ సమస్యను తగ్గించడానికి ఐటిఐలు, విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ప్రైవేట్ కళాశాలలను రాష్ట్ర నైపుణ్య పోర్టల్‌కు అనుసంధ...