భారతదేశం, నవంబర్ 25 -- ఏపీలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని రోజులుగా మంత్రుల కమిటీ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. అందులో కొన్ని మార్పులు జరిగాయి. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది.

ఇక రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు కానున్నాయి. ఐదింటికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటు కానున్న మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు ...