భారతదేశం, డిసెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. హజ్ 2026 యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదలైంది. హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి మక్కాకు వెళ్లేవారు. ఇప్పుడు విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్‌ ఏర్పాటుతో భారీ ఉపశమనం దక్కింది ఏపీ యాత్రికులకు.

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. అయితే రూ.లక్ష ఆర్థిక సాయం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇతర నగరాల నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికంటే.. విజయవాడ నుంచి వెళ్లేవారికి విమాన టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. అదనపు భారం హజ్ యాత్రికులపై పడకుండ...