భారతదేశం, మే 27 -- ఏపీలో మహిళల భద్రత కోసం "శక్తి వాట్సప్ నంబర్"ను ఏపీ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో కాల్‌ చేసినా, మెసేజ్ చేసినా స్పందించేలా వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి వాట్సాప్‌ నంబర్‌ 79934 85111 ను డీజీపీ హరీష్ గుప్తా మంగళవారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భాగస్వామ్యంలో ఈ సేవల్ని ప్రారంభించారు.

ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన "శక్తి" యాప్‌కు ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈ క్రమంలో మహిళల భద్రత కోసంఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఆధ్వర్యంలో శక్తి వాట్సప్ నంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకు వచ్చారు.

మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీష...