భారతదేశం, జనవరి 1 -- విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడనుంది. ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రాభివృద్ధిలో ఇదోక కీలక పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రాభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయిగా నిలవబోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్‌వే, టెర్మినల్‌ భవన...