Andhrapradesh,telangana, ఏప్రిల్ 27 -- ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉదయం దాటితే చాలు. బయటికి వెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ వడగాల్పులు, రాత్రి వేళ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిిరి అవుతున్నారు.

ఏపీలో ఓవైపు ఎండల తీవ్రత ఉండగా. మరోవైపు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర - దక్షిణ ద్రోణి తెలంగాణ నుంచి రాయలసీమ వరకు, తమిళమనాడు కొనసాగుతోంది. ఇది సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తా...