భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలులకు అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలోని గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు.

అలాగే రేపు(బుధవారం) 41-43degC మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో ...