Hyderabad, సెప్టెంబర్ 30 -- రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన మూవీ కాంతార ఛాప్టర్ 1. మూడేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన కాంతారకు ఇది ప్రీక్వెల్. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుండగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్ల ధరలను పెంచడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సాధారణంగా తెలుగులో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఏపీతోపాటు తెలంగాణలోనూ టికెట్ల ధరలను పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1లాంటి కన్నడ సినిమాకు కూడా ఏపీలో భారీగా టికెట్ల రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.75 ప్లస్ జీఎస్టీ పెంచేందుకు అనుమతి ఇవ్వగా.. మల్టీప్లెక్స్ లలో రూ.100 ప్లస్ జీఎస్టీ పెరగనుంది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్...