భారతదేశం, సెప్టెంబర్ 8 -- కొన్ని రోజులుగా ఐఏఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఏ సీనియర్ అధికారిని ఎటువైపు పంపాలి అని సీఎం చంద్రబాబు కొన్నిరోజులుగా తీవ్రంగా కసరత్తు చేశారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం ఉండాలని అధికారులను ఆదేశించారు.

మెుత్తం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవోగా అనిలు కుమార్‌ సింఘాల్ మళ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు పలువురు సీనియర్ ఐఏఎస్‌లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. హెల్త్ విభాగం నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేయడమే క...