భారతదేశం, అక్టోబర్ 29 -- మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. జేసీబీలతో రాళ్లను తొలగిస్తున్నారు.లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.

అచ్చంపేట - శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్రవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాజీపూర్ నుండి బ్రాహ్మణపల్లి మధ్య ఉన్న వంతెన పై నుంచి నీర...