భారతదేశం, జనవరి 19 -- స్విట్జర్లాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు... పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను ముఖ్యమంత్రి కోరారు.

ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్-ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కోరారు చంద్రబాబు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను... పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత్ అంబాసిడర్‌కు వివరించారు.

సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని, సుమారు రూ. 2 లక్...