భారతదేశం, మే 19 -- ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈఏపీ సెట్‌ 2025కు ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597 మంది అభ్యర్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు.మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశ పరీక్ష లు నిర్వహిస్తారు.

ఈఏపీ సెట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓ సెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి 5వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 145 కేంద్రాల్లో, తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ ఒక్కోటి చొప్పున ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

విద్యా ర్థులకు ఏపీ ఈఏపీస...