భారతదేశం, జూన్ 17 -- ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి అవమానించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది.

భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యను చెట్టు కట్టేసిన చిత్రహింసలు పెట్టారు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం తిమ్మరాయప్ప రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను గ్రామంలో వదిలేసి వెళ్లిపోయాడు తిమ్మరాయప్ప. దీంతో తిమ్మరాయప్ప భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ...భర్త చేసిన అప్పులు తీరుస్తుంది.

సకాలంలో అప్పు చెల్లించలేదని మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు... రోడ్డుపై వెళ్తున్న తిమ్మరాయప్ప భార్యను అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డ...