Kuppam,andhrapradesh, జూలై 4 -- రోగుల వైద్య రికార్డులను అస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెర్వ్ సెంటర్ ను కుప్పం ఏరియా ఆస్పత్రిలో ప్రారంభించారు.

పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను డిజినెర్వ్ సెంటర్ తో అనుసంధానించారు.

అనంతరం పీహెచ్సీలకు చెందిన హెల్త్ ఆఫీసర్లతో వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు సంభాషించారు. వైద్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు.

ఈ సేవలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "రెండో దశలో చిత్తూరు జిల్లా...