Andhrapradesh, ఆగస్టు 3 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలపై ఎట్టకేలకు ప్రకటన వచ్చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ ను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆగస్ట్ 18వ తేదీన విడుదల చేయనుంది.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆగస్ట్ 18వ తేదీ నుంచి ప్రారంభించి. 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ప్రత్యేక కేటగిరి పత్రాల పరిశీలన ఆగస్ట్ 21 నుంచ 23 వరకు ఉంటుంది. ఇక ఆగస్ట్ 21వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్ట్ 24వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.

ఇక ఆగస్ట్ 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. విద్యార్థుల మార్కులు, వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్ట్ 27వ తేదీన సీట్లను కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటి సెమిస్టర్ తరగతులు ఆగస్ట్ 28 నుంచి ప్రారంభమవుతాయి.

మరోవైపు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు ఉన్నత...