Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఆగస్ట్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://oamdc.ucanapply.com/? వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక...