భారతదేశం, ఏప్రిల్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోయారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించి నమోదయ్యాయి. గత వారం వాతావరణ మార్పులతో కాస్త చల్లబడినా తిరిగి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఏపీలో ఆదివారం ఎండలు ఠారెత్తించాయి. రోజంతా భానుడి ప్రభావం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. రాయలసీమలో గాలిలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఠారెత్తిపోయారు.

కోస్తా జిల్లాల్లోకొన్నిచోట్ల సముద్రం నుంచి వచ్చే గాలులతో గాలిలో శాతం తేమశాతం పెరిగి ఉక్కపోతతో జనం విలవిలలాడారు. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరగడంతో ఓ వైపు ఎండ తీవ్రత, మరో వైపు ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా...