Andhrapradesh, మే 21 -- ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదేళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక టీచర్ల విషయానికొస్తే.. ఒకే స్కూల్ లో 8 ఏళ్లు సర్వీస్ పూర్తయితే బదిలీకి అవకాశం ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.సర్వీస్‌ పాయింట్లను ఏడాదికి 0.5గా కేటాయించనున్నట్లు పేర్కొంది. కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు ఇవ్వనున్నారు. ఇక కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ వివరించింది.

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొత్తం జూన్ మొదటి వారంలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా ప్రాధానోపాధ్యాయులు, టీచర్ల నుంచి దర...