భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీతో తరగతులు ముగుస్తాయి. విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యుటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారమే విధుల నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరంలో చివరి పనిదినమైన ఏప్రిల్ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో విద్యా సంవత్సరంలో చివరి పనిదినంగా ఇప్పటికే ప్రకటించారు.

2024 జూన్ 12న స్క...