భారతదేశం, జనవరి 21 -- రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. వచ్చే ఉగాది నుంచి ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలిచ్చారు. ఈ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ. కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృ...