భారతదేశం, మే 11 -- ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. వాట్సాప్ 'మన మిత్ర'లో కూడా రేషన్ కార్డు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో దాఖలైన దాదాపు 3.36 లక్షల అప్లికేషన్లను కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 15 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం వాట్సాప్ 'మనమిత్ర' ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పలు రకాల ప్రభుత...