భారతదేశం, నవంబర్ 28 -- కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లను జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ కాపీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మ...