భారతదేశం, నవంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు ఆసక్తిగా మారింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా మదనపల్లె, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఏర్పాటు అవుతాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇవి ఖరారు అయిపోయినట్టే. అయితే తాజాగా మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది.

రంపచోడవరం, చింతూరు డివిజిన్లు ప్రస్తుతం అల్లూరి సితారామరాజు జిల్లాలో ఉన్నా.. అవి తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా విస్తీర్ణం, జనాభా మరింత పెరుగుతుంది. పోలవరం ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రంపచోడవరాన్ని కొత్త జిల్లా కేంద్రం ...