భారతదేశం, డిసెంబర్ 29 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో విడుదల కానుంది. సమావేశంలో పలు కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్న రాయచోటి, కొత్తగా సృష్టించిన మదనపల్లె జిల్లాలో విలీనం అవుతుంది.

రాజంపేట కడప జిల్లాలో కలుస్తుంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాకు కలిపేస్తారు. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా ఆమోదం లభించింది. అనివార్య పరిస్థితుల కారణంగా, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పునర్వ్యవస్థీకరణ అవసరమని ముఖ...