భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలోని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డ‌ల కోసం అదనంగా మరో 8 ప్ర‌త్యేక న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్రకటన విడుదల చేశారు. వీటి ద్వారా అద‌నంగా 80 ప‌డ‌క‌లు (వార్మ‌ర్స్‌) అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు.

ఒక్కో ఎస్ఎన్‌సియు ఏర్పాటుకు రూ.60 ల‌క్ష‌లు అవ‌స‌రం కాగా, 8 ఎస్ఎన్‌సియుల‌కు గాను మొత్తం రూ.4.80 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. అలాగే ఒక్కో ఎస్ఎన్‌సియుకు నెల‌కు రూ. 8.91 ల‌క్ష‌లు చొప్పున 8 ఎస్ఎన్‌సియుల‌ నిర్వ‌హ‌ణ‌కు దాదాపు రూ.1.07 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిపారు.

ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట‌ర్న్‌షిప్‌(పిపిపి) విధానంలో ఈ 8 ఎస్ఎన్‌సియులు(Special Newborn Care Units)) న‌డుస్తాయి. కోన‌సీమ జిల్లా అమ‌లాపురం ఏరియా ఆసుప‌త్రి, ...