భారతదేశం, మే 4 -- సీఎం చంద్రబాబు ఏ పథకం తీసుకొచ్చిన దానివెనుక ఒక స్కామ్ త‌ప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. అలాంటిదే కొత్తగా మ‌రో స్కాం బ‌య‌ట‌కొచ్చిందన్నారు. బ‌ల‌హీనవ‌ర్గాల మ‌హిళ‌లను ఆర్థికంగా నిల‌దొక్కుకునేలా చేస్తామ‌ని చెబుతూ కూట‌మి ప్రభుత్వం భారీ అవినీతికి తెర‌దీసిందని ఆరోపించారు. చంద్రబాబు మాట‌ల‌కు చేత‌ల‌కు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు.

"పేద‌ల పేరుతో సంప‌ద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహ‌స్తుడు. పేద‌ల‌కు ల‌బ్ధి చేకూర్చిన‌ట్టు పైకి చెప్పకుంటూ ఆయ‌న, ఆయ‌న మ‌నుషులు లాభ‌ప‌డ‌తారు. చంద్రబాబు ఐటీ తెచ్చాన‌ని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాల‌జీ గురించి మాట్లాడ‌తారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు.

చివ‌రికి మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిష‌న్ల పంపిణీ ద్వా...