భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏపీ దారుణం హత్య జరిగింది. ఆలూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు ఆయనపై దాడి చేశారు. గుంతకల్లు నుండి చిప్పగిరికి ఇన్నోవా వాహనంలో వెళ్తున్న లక్ష్మీనారాయణను టిప్పర్‌తో ఢీకొట్టారు. దీంతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచారు. లక్ష్మీ...